NTV Telugu Site icon

SA 20: భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్.. బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని

Cricket

Cricket

SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య 8వ మ్యాచ్‌ జరిగింది. డర్బన్ జట్టు బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్‌తో ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో, క్లాసెన్ 10వ ఓవర్ 5వ బంతిని కాస్త బలంగా బ్యాక్‌ఫుట్ నుంచి కొట్టాడు. దాంతో 87 మీటర్ల దూరాన్ని దాటిన ఈ సిక్సర్ స్టేడియం పైకప్పుపై పడింది. అక్కడ నుంచి బౌన్స్ అయి బంతి నేరుగా పక్కనే ఉన్న రోడ్డుపైకి వెళ్లింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ అభిమాని బంతిని చూసి దానిని తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటనతో ఆ మ్యాచ్‌లో బంతిని మార్చాల్సి వచ్చింది. స్టేడియం బయట జరగడంతో ఆ అభిమాని తర్వాత ఏమి చేసాడో తెలియ రాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Congress New Office: నేడు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..

ఇక ఈ మ్యాచ్ జనవరి 14న డర్బన్‌లో జరిగింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన డర్బన్ జట్టు 7 ఓవర్లలోనే 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్లలో కేవలం 66 పరుగులే చేయగలిగిన స్థితిలో, క్లాసెన్ ఇన్నింగ్స్‌ను స్పీడ్ ను పెంచే ప్రయత్నం చేసాడు. అయితే ఈ దశలో అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కేవలం 29 పరుగులు చేసి క్లాసెన్ అవుట్ అయినప్పటికీ, అతని సిక్సర్ మాత్రం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటన డర్బన్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతోంది. మొత్తానికి డర్బన్ సూపర్ జెయింట్స్ కేవలం 18 ఓవర్లు లోనే 141 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగులతో విజయం సాధించింది.

Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైన రిషబ్ పంత్

Show comments