SA 20: భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్.. బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని
- SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్
- మ్యాచ్ లో భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్..
- బంతి స్టేడియం బయట పడడంతో తీసుకుని పారిపోయిన అభిమాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య 8వ మ్యాచ్ జరిగింది. డర్బన్ జట్టు బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్‌తో ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో, క్లాసెన్ 10వ ఓవర్ 5వ బంతిని కాస్త బలంగా బ్యాక్‌ఫుట్ నుంచి కొట్టాడు. దాంతో 87 మీటర్ల దూరాన్ని దాటిన ఈ సిక్సర్ స్టేడియం పైకప్పుపై పడింది. అక్కడ నుంచి బౌన్స్ అయి బంతి నేరుగా పక్కనే ఉన్న రోడ్డుపైకి వెళ్లింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ అభిమాని బంతిని చూసి దానిని తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటనతో ఆ మ్యాచ్‌లో బంతిని మార్చాల్సి వచ్చింది. స్టేడియం బయట జరగడంతో ఆ అభిమాని తర్వాత ఏమి చేసాడో తెలియ రాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Congress New Office: నేడు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..
Also Read
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ఇక ఈ మ్యాచ్ జనవరి 14న డర్బన్‌లో జరిగింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన డర్బన్ జట్టు 7 ఓవర్లలోనే 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్లలో కేవలం 66 పరుగులే చేయగలిగిన స్థితిలో, క్లాసెన్ ఇన్నింగ్స్‌ను స్పీడ్ ను పెంచే ప్రయత్నం చేసాడు. అయితే ఈ దశలో అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కేవలం 29 పరుగులు చేసి క్లాసెన్ అవుట్ అయినప్పటికీ, అతని సిక్సర్ మాత్రం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటన డర్బన్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతోంది. మొత్తానికి డర్బన్ సూపర్ జెయింట్స్ కేవలం 18 ఓవర్లు లోనే 141 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగులతో విజయం సాధించింది.
Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన రిషబ్ పంత్
— rohitkohlirocks@123@ (@21OneTwo34) January 14, 2025
తాజావార్తలు
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!