టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కప్పుడు ఆమె లేని సినిమా అంటూ లేదు. ముఖ్యంగా బ్రహ్మానందంతో తనది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రజంట్ అవకాశాలు తగ్గినప్పటికీ అక్కడ సినిమాలో కనిపిస్తుంది. ఇక కెరీర్ పరంగా బీజిగా లేనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజోలు వంటి మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం వెనుక ఉన్న కష్టాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Also Read : Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం దాటుతుందా? నేడే ఫైనల్ తీర్పు!
‘కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొన్నప్పటికీ, ఏ రోజూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ముఖ్యంగా నా ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వార్తలు చూస్తే నవ్వొస్తుంది. నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందనేది ముఖ్యం కాదు, తానెప్పుడూ ఎవరికీ తల వంచకుండా బ్రతకడమే ముఖ్యం. రేపు పొద్దున్న నాకు సినిమా అవకాశాలు లేకపోయినా, బతుకు తెరువు కష్టమైనా.. ఒక దోశల బండి పెట్టుకుని అయినా బ్రతికేస్తాను కానీ, ఎవరి దగ్గర చేయి చాచి తలవంచను. సమాజంలో కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వారి కంటే, దూరం జరిగే వారే ఎక్కువ. నా స్వభావం నచ్చిన వారు నను ఒక ఆడపడుచులా గౌరవిస్తారు. నా చేత్తో ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. నా పద్దతులు, సెంటిమెంట్స్ ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చుతాయి. అందుకే ఇప్పటికీ నేను గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా’ అని హేమ ధీమాగా చెప్పారు. ఒకరిని చూసి ఒకరు గొప్పలకు పోయి వాతలు పెట్టుకోవడం వల్ల పతనం మొదలవుతుందని, తాను మాత్రం ఎప్పుడూ ఉన్నదానితోనే తృప్తిగా ఉంటానని స్పష్టం చేశారు.
