Site icon NTV Telugu

Helicopter Missing: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం

Nepal

Nepal

Helicopter Missing: నేపాల్‌లోని సోలుకుంబు నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న సమయంలో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఆరుగురితో కూడిన హెలికాప్టర్ ఈ రోజు అదృశ్యమైంది. 9ఎన్‌ఎండబ్ల్యూ కాల్ గుర్తుతో ఉన్న ఛాపర్ ఉదయం 10:15 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాన్ని కోల్పోయింది. ఈ మేరకు సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. సోలుకుంబులోని సుర్కి నుంచి బయలుదేరిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్15 నిమిషాలకే కనిపించకుండా పోయిందని ఖాట్మండు పోస్ట్ నివేదించింది. కెప్టెన్ చెట్ గురుంగ్ ఈ హెలికాప్టర్‌కు పైలట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం హెలికాప్టర్‌ను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Also Read: Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై పిటిషన్లు.. ఆగస్టు 2 నుంచి విచారణ

హెలికాప్టర్‌ను ఖాట్మండులో ఉన్న ప్రైవేట్ కంపెనీ మనంగ్ ఎయిర్ నిర్వహిస్తోంది. ఈ హెలికాప్టర్ తూర్పు నేపాల్‌లోని పర్వత ప్రాంతాల సోలుకుంబు జిల్లా నుంచి రాజధాని ఖాట్మండుకు ఐదుగురు విదేశీ పర్యాటకులను తీసుకువెళుతోంది. విమానంలో ఉన్న విదేశీ పౌరులందరూ మెక్సికన్ పౌరులని ప్రాథమిక మీడియా నివేదికలు సూచించాయి.

Exit mobile version