Site icon NTV Telugu

Helicopter Crash: షాకింగ్ సీన్.. నీరు నింపే ప్రయత్నంలో బొక్క బోర్ల పడ్డ హెలికాప్టర్.. వైరల్ వీడియో

Viral Helicopter

Viral Helicopter

Helicopter Crash: సాధారణంగా వాహనాల ప్రమాదాల వీడియోలు చూసినప్పుడు ప్రజలు భయబ్రాంతులకు లోనవుతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బైక్, కారు, బస్సు, లారీ ఇలా వాహనాల యాక్సిడెంట్స్ కు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదం వీడియో అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వైరల్ వీడియోలో.. ఒక హెలికాప్టర్ జలాశయం నుంచి నీరు నింపే సమయంలోనే కుప్పకూలిపోయింది.

Vinayaka Chaturthi 2025: ఏపీలో వెరైటీ వినాయక విగ్రహాలు.. అదిరిపోయే లుక్లో దర్శనం

అందిన సమాచారం ప్రకారం, ఫ్రాన్స్‌లో అగ్నిమాపక శాఖకు చెందిన H125 Ecureuil హెలికాప్టర్ అటవీ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసేందుకు నీరు నింపుకోవడానికి జలాశయంపైకి వచ్చింది. వీడియోలో కనిపించినట్టుగా హెలికాప్టర్ నీరు తీసుకునే క్రమంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. క్షణాల్లోనే హెలికాప్టర్ పూర్తిగా నీటిలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన కణాల్లో జరిగిపోవడంతో అక్కడి ప్రజలకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

Rajnath Singh: హిమగిరి, ఉదయగిరి యుద్ధనౌకలు దేశానికి అంకితం.. విశాఖలో రక్షణ మంత్రి

ప్రత్యక్ష సాక్షులు ఈ దుర్ఘటన క్షణాలను కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానితో వీడియో క్షణాల్లోనే వీడియో వైరల్ అవడంతో, దానిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ప్రమాదం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు హెలికాప్టర్ నీరు తీసుకునే క్రమంలో అంత కిందకు వస్తుందని ఊహించలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version