Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!

Heinrich Klaasen

Heinrich Klaasen

Heinrich Klaasen: ఐపీఎల్ 2026 సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) తన బ్యాట్ తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ సౌతాఫ్రికా స్టార్, తనపై పెట్టిన భారీ ధర (23 కోట్లు)కు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రతి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో క్లాసెన్ స్థిరత్వం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 31(22)తో ప్రారంభించిన అతను, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ పై 52(35), లక్నో సూపర్ జెయింట్స్ పై 62(41) వంటి అద్భుత ఇన్నింగ్స్‌లతో తన క్లాస్ ఏంటో రుచి చూపించాడు. అలాగే మధ్యలో పంజాబ్ కింగ్స్ పై 39(33), రాజస్థాన్ రాయల్స్ పై 40(26), మరోసారి అదే జట్టుపై 29(24)తో పరుగుల సునామి సృష్టిస్తున్నాడు.

అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 59(39), ఢిల్లీ క్యాపిటల్స్ 37*(13) వంటి మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు అతని అసలు విలువను చూపించాయి. ముఖ్యంగా నిన్న రాత్రి ముంబై వేదిక జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 65*(30)తో ఆడిన ఇన్నింగ్స్ అతన్ని ఈ సీజన్‌లో టాప్ మ్యాచ్ విన్నర్‌ గా నిలబెట్టింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ 2026 సీజన్ లో 9 మ్యాచ్ లలో 414 పరుగులతో ఆరంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.

క్లాసెన్ బ్యాటింగ్‌లో పవర్ మాత్రమే కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని ఆడే సామర్థ్యం కూడా ఉంది. అవసరమైనప్పుడు ఆగ్రెసివ్‌గా, అవసరమైనప్పుడు స్మార్ట్‌గా ఇన్నింగ్స్‌ను నడిపించగలగడం అతని ప్రత్యేకత. ఈ కారణంగానే అతను ఆరెంజ్ ఆర్మీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. SRH అభిమానులు ముద్దుగా ‘కాటేరమ్మ కొడుకు’గా పిలుచుకుంటారు. 23 కోట్లకు కొనుగోలు చేసిన క్లాసెన్, తన ఆటతో ప్రతి రూపాయికి విలువ అందిస్తున్నాడు. ఈ స్థాయి కన్‌సిస్టెన్సీతో కొనసాగితే, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలవడం ఖాయం.