Heinrich Klaasen: నేడు ఉదయం అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ చెప్పిన కొన్ని గంటలకే మరో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో కాదు.. దక్షిణాఫ్రికా జట్టు వికెట్‌కీపర్ అండ్ బ్యాట్స్‌మన్ హేన్రిచ్ క్లాసెన్. తాజాగా క్లాసెన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 32 ఏళ్ల క్లాసెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా భావోద్వేగపూరిత సందేశాన్ని షేర్ చేస్తూ, ఇకపై ప్రోటియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోనని ప్రకటించారు.
Read Also: Operation Sindoor: భారత్ సేకరించిన “చైనీస్ ఆయుధ శిథిలాల”పై ప్రపంచం ఆసక్తి.. చైనా ఆందోళన..
ఇక క్లాసెన్ తన పోస్ట్ లో భావోద్వేగంగా తన రిటైర్మెంట్ ప్రకటనను పంచుకున్నాడు. ఇది నా జీవితంలో ఒక బాధాకరమైన రోజు. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ పేర్కొన్నారు. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ, నా కుటుంబ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని, ఇది నాకైతే ప్రశాంతత కలిగిస్తోంది అంటూ రాసుకొచ్చాడు. అలాగే దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం తన చిన్నప్పటి కలగా పేర్కొన్న క్లాసెన్, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణమని అన్నారు. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, అభిమానులందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు కొద్ది మంది కోచ్‌లు నన్ను నమ్మడం వల్లనే ఈ రోజు ఇక్కడ ఉన్నానన్నారు.
Read Also: Hardik Pandya: శ్రేయస్ బ్యాటింగ్ చూసి మతిపోయింది.. ఈ రోజు బూమ్ పేలలేదు!
నిజానికి క్లాసెన్ తన దూకుడు గల ఆట శైలితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2025 సీజన్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు క్లాసెన్. కోల్కతా నైట్ రైడర్స్ పై కేవలం 37 బంతుల్లోనే 105 పరుగులు చేసి సెంచరీ సాధించారు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న క్లాసెన్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరిగే లీగ్‌ల్లో క్రికెట్ కొనసాగనున్నాడు.
