NTV Telugu Site icon

Sonakshi Sinha: పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా: సోనాక్షి సిన్హా

Sonakshi Sinha Marriage

Sonakshi Sinha Marriage

Sonakshi Sinha Funny Comments on Her Marriage: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెగెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌ లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రచారంలో భాగంగా హీరామండి టీమ్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ.. సోనాక్షి సిన్హాను పెళ్లి గురించి అడిగారు. ‘అలియా భట్‌, కియారా అద్వానీ పెళ్లి చేసుకున్నారు?. మరి మీది ఎప్పుడు’ అని అడగ్గా.. సోనాక్షి నవ్వులు పూయించారు. ‘మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు కదా. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు నేను ఎంతగా ఎదురుచూస్తున్నానో మీకు తెలుసు. ఎప్పుడో ప్రారంభించిన హీరామండి షూటింగ్ పూర్తయింది. రిలీజ్ కూడా అయింది. కానీ నాకింకా పెళ్లి కాలేదు. మాకు తప్ప ఈ సిరీస్‌లో నటించిన అందరికీ పెళ్లయింది’ అని సోనాక్షి అన్నారు.

Also Read: Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!

హీరామండిలో నటించిన షర్మిన్ సెగల్ కూడా పెళ్లి చేసుకుందని కపిల్ శర్మతో సోనాక్షి సిన్హా అన్నారు. వెంటనే మనీషా కొయిరాలా మాట్లాడుతూ… ‘రిచా చద్ధా వివాహం చేసుకుంది. ఆమె గర్భవతి అయింది కూడా’ అని సరదాగా అన్నారు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. నటుడు అలీ ఫజల్‌ను 2023 అక్టోబర్‌లో రిచా వివాహమాడారు. ఫిబ్రవరి 2024లో తాను గర్భం దాల్చినట్లు ఆమె ప్రకటించారు. షర్మిన్ వివాహం 2023 నవంబర్‌లో జరిగింది. 2024 మార్చిలో అదితి రావ్ హైదరీ వివాహం జరిగింది. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Show comments