నీటి ఊట.. టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్‌కి తీవ్ర ఆటంకంగా మారింది. నీరు నిరంతరాయంగా వస్తోంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ సర్వే టీమ్ అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిర్మలాపూర్ సమీప ప్రాంతం లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ టీమ్ సర్వే నిర్వహించాయి. మల్లెల తీర్థం నుంచి కృష్ణా నది వైపు ప్రవాహం సాగుతోంది. ప్రస్తుతం ప్రమాద స్థలం పైభాగం 450 మీటర్ల లోతులో కుర్తి పెంట టేకుల సర్వ ప్రదేశంలో పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పొరలు అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీ క్షేత్ర పరిధిలోని తాటి గుండాల పరిసర ప్రాంతాలలోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణ నది వైపు పారుతున్నట్లు అంచనా వేశారు. పై వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు.
READ MORE: MAD 2 : ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’
కాగా.. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ(SLBC) టన్నెల్లో ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన 5 మృతదేహాలు గుర్తించారు. ఈ 5 మృతదేహాలను వెలికి తీయడానికి మరింత సమయం పడుతుందని, కొన్ని మీటర్ల లోతు మట్టి లో మృతదేహాలు కూరుకు పోయాయి. మిగతా ముగ్గురి మృతదేహాల గాలిస్తున్నారు.