Site icon NTV Telugu

Heavy Traffic : హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జాం

Traffic

Traffic

హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పిడింది. లక్డీకపూల్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్థంభించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12, రోడ్‌ నెం. 1లో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడ చిక్కుకుపోయాయి. ఊహించని రీతిలో వాహనాలు రద్దీ పెరిగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. ఐకియా, గచ్చిబౌలి, నానాక్‌రామ్‌గూడలో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. దీంతో వేల కొద్దీ వాహనాలు రోడ్డలపైనే నిలిచిపోయాయి. కేంద్రం తీసుకువచ్చిన హిట్‌&రన్‌ నిబంధనలకు ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో.. పెట్రోల్‌ బంక్‌లకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిన్నటి నుంచి నిలిచిపోయింది.

 

ఇంకో రెండు రోజుల పాటు ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె కొనసాగించే అవకాశం ఉందని వార్తలు రావడంతో పెట్రోల్‌, డీజిల్‌ కోసం భారీగా వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు ముందు క్యూ కట్టారు. అయితే.. ఈ రోజు సాయంత్రం ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెను విరమించడంతో యధావిధిగా ఈ రోజు రాత్రి వరకు అన్ని పెట్రోల్‌ బంక్‌లకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా జరగనుంది. అయితే.. ఇప్పటికే బంక్‌ల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు పూర్తి అయిపోవడంతో బంక్‌ల ముందు నోస్ట్కాక్‌ బోర్డులు పెట్టారు బంక్‌ యాజమానులు. అయితే.. ఊహించని రీతిలో రోడ్లపైకి వాహనాలు రావడంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అయితే.. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నగరంలోనే కాకుండా.. జిల్లాల్లో కూడా పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంక్‌లు ముందు వాహనదారులు క్యూకట్టారు.

 

 

Exit mobile version