Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
- ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు- వాతావరణ శాఖ
- గంగా నది పశ్చిమ బెంగాల్‌పై లోతైన అల్పపీడనం
- ఈరోజు.. రేపు జార్ఖండ్.. గంగానది పశ్చిమ బెంగాల్.. ఒడిశా.. బీహార్‌లో అతి భారీ వర్షాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వాతావరణ శాఖ ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. గంగా నది పశ్చిమ బెంగాల్‌పై లోతైన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో.. ఈరోజు, రేపు జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్‌లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది. అలాగే.. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
Read Also: PM Modi: హేమంత్ సొరెన్, కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశీ, రోహింగ్యాలతో జతకట్టింది..
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలైన.. మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, గుజరాత్‌లలో ఒక వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు, రేపు.. తూర్పు మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 16-18 మధ్య అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే.. తూర్పు మధ్యప్రదేశ్‌లో రేపు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Team India: ఈ ముగ్గురు యువ ఆటగాళ్ళు మున్ముందు రికార్డులు నెలకొల్పుతారు..
తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన.. జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో ఈరోజు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక ఉంది. అలాగే.. బీహార్‌లో రేపు, ఎల్లుండి.. జార్ఖండ్, ఒడిశాలో రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సెప్టెంబర్ 15, 18, 19, 21 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో వర్షాలు పడుతాయని.. గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-పశ్చిమ భారత రాష్ట్రాలైన.. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్ 17న, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 15-18 తేదీల్లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 17-18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ భారత రాష్ట్రాలైన.. కోస్తా కర్ణాటక, కేరళ, మహే, లక్షద్వీప్‌లలో ఈ వారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!