Site icon NTV Telugu

Weather alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rain

Rain

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్‌గా మారిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదిలా ఉంటే రాబోయే 5 రోజుల్లో మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రాబోయే 2 రోజుల్లో వాయువ్య భారతదేశంలో కొన్ని చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..

గత కొద్ది రోజులుగా దేశమంతా తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడిపోయారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం వాతావరణం కూల్‌గా మారడంతో ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో భారీగానే వర్షం కురుస్తుంది.

ఇది కూడా చదవండి: Nitish Kumar: “నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా”.. ఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్..

Exit mobile version