Site icon NTV Telugu

Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Mumbai Rais

Mumbai Rais

దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు ముంబైలో రెండు రోజుల పాటు(శుక్ర, శని) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావారణ శాఖ. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శనివారం కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Sreeleela: ఈ అందాన్ని ఏ హీరో వదులుతాడు.. చెప్పండి

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, పాల్ఘర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. శుక్రవారం జరగాల్సిన 10, 12వ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను 10వ తరగతి పేపర్లు ఆగస్టు 2న, 12వ తరగతి పేపర్లు ఆగస్టు 11న నిర్వహించనున్నారు. ముంబైలో జూలై 24, 25 తేదీలలో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.

Extramarital Affair: భర్త అప్పు చేసి చదివిస్తే.. ఉద్యోగం వచ్చాక భార్య మరొకరితో ఎఫైర్

మరోవైపు భారీ వర్షాల ధాటికి రాయ్‌ఘడ్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోగా.. 8 మంది గాయాపడ్డారు. ఇప్పటివరకు 109 మంది ఆచూకీ లభించింది. ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రమాద బాధితులకు పునరావాసం కల్పిస్తామన్నారు. అదే సమయంలో మృతుల బంధువులకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మరోవైపు రాయ్‌గఢ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఏక్ నాథ్ షిండే తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ఆయన చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఆర్మీ హెలికాప్టర్లను తీసుకెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని, అయితే ప్రతికూల వాతావరణం కారణంగా వాటిని ఉపయోగించలేమని సీఎం షిండే చెప్పారు.

Exit mobile version