Brazil Rains: బ్రెజిల్ లో భారీ వర్షాలు.. 78 మంది మృతి.. 105 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో రోజు రోజుకు ఎండలు మండుతుంటే.. విదేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బ్రెజిల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అల్లాడుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. దీంతో అక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వర్షాలకు రియో గ్రాండ్ డొ సుల్ (Rio Grande do Sul) రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ 78 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వరదలకు 155 మందికిపైగా గాయపడినట్లు పేర్కొంది. సుమారుగా లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది. ఉరుగ్వే, అర్జెంటీనాకు సరిహద్దున ఉన్న రాష్ట్రంలోని దాదాపు 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని వరదలు ప్రభావితం చేసినట్లు వెల్లడించింది.
READ MORE: Warren Buffett: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నాను: వారెన్ బఫెట్
Also Read
పెద్ద ఎత్తున్న వచ్చిన వరదల కారణంగా పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రధాన నగరాలను కలిపే వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు నాలుగు లక్షల మందికిపైగా ప్రజలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది. సైత్యం వరదల్లో చిక్కుకున్న జనాలకు సహాయక చర్యలు అందిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గాయాల పాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో సహాయం చేసేందుకు రెండ్రోజుల కిందటే 626 దళాలలతోపాటు, 12 విమానాలు, 12 బోట్లను మోహరించారు. కాగా.. గత రెండ్రోజుల కిందట గవర్నర్ ఎడ్వర్డోలైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!