చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతుంది. బీజింగ్ లో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. మరోవైపు టైఫూన్ డాక్సూరితో చైనాకు పెద్ద విపత్తు వచ్చి పడింది. బీజింగ్ పరిసర ప్రాంతాల వేలాది మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. నదుల్లో నీరు ప్రమాదకరస్థాయికి చేరింది. వర్షాల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి.. విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బీజింగ్ చుట్టుపక్కల కుండపోత వర్షాలకు కనీసం 21 మంది మరణించారని.. ఇప్పటివరకు 30 మంది గల్లంతయ్యారని చైనా అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Bhola Shankar: భోలా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే
మరోవైపు బీజింగ్ లో వరదలకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వరదల ప్రభావంతో బీజింగ్ లో ఓ అపార్ట్ మెంట్ పునాదుల వద్ద పాతాళాన్ని తలపించేలా అతిపెద్ద సింకోల్ ఏర్పడింది. సదరు అపార్ట్ మెంట్ పునాది వద్ద ఏర్పడిన అతిపెద్ద గుంతలోకి భారీగా వరదనీరు వెళ్తుంది. మరోవైపు ఆ నీరు ఎక్కడికి వెళుతుందో కూడా అర్థం కావడం లేదు. మరోవైపు బీజింగ్ లో విమానాశ్రయం కూడా నీట మునిగింది.
Health Tips : వర్షాకాలంలో అరటిపండ్లను ఎక్కువగా తింటున్నారా?
బీజింగ్ లో ఈ స్థాయిలో వర్షాలు దంచికొట్టడం 140 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి బుధవారం మధ్య అక్కడ 744.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. 1891లో రికార్డు స్థాయిలో 609 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని… ఆ రికార్డు ఇప్పుడు బద్దలైందని వెల్లడించింది.