వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజనల్ వ్యాదులు మనల్ని వదలవు.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి.. ఇక ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను తెలుసుకోవాలి.. అయితే వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా అనే సందేహం అందరికి వస్తుంది.. ఈరోజు మనం వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చునో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇక ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం ఉండదు. అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.. ఈ వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వక కడుపులో మంట, కడుపులో నొప్పి వస్తుంది. అరటి పండ్లలో పెక్టిన్ అనే పైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియను బాగా చేస్తుంది..
ఈ పండ్లలో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అరటిపండులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతి రోజు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఒక అరటిపండును తినవచ్చు.. ప్రతి రోజు ఒక అరటిపండును తినడం మంచిది.. ఈ సీజన్ లో ప్రయత్నించండి.. అరటిపండు అందాన్ని మెరుగు పరుస్తుంది.. బనానా పేస్ ప్యాక్ వేసుకోవచ్చు.. అలాగే జుట్టుకు కూడా మంచి పోషణ ఇస్తుంది.. అరటిపండు పిల్లలకు కూడా మంచిదే.. వాళ్లకు ఆహారాన్ని అరిగించడం కోసం ఎక్కువగా ఈ పండ్లను తినిపిస్తారు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండ్లను తినడం మర్చిపోకండి..