Dubai Rains: భారత్-దుబాయ్ మధ్య విమాన సర్వీస్‌లు రద్దు.. ఎప్పటివరకంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింంది. భారీ ఎదురుగాలులు, వడగండ్ల వర్షంతో దుబాయ్‌ను అతలాకుతలం చేసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ ప్రవాహనికి కార్లు, బైకులు, వస్తువులు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఇక ఎయిర్‌పోర్టులోకి వర్షపునీరు చేరిపోవడంతో విమానాలు కూడా మునిగిపోయాయి. పెద్ద ఎత్తున రోడ్లు కోతకు గురయ్యాయి. ఏడాది వర్షమంతా ఒక్క మంగళవారమే కొన్ని నిమిషాల్లో కురిసి బెంబేలెత్తించింది.
ఇది కూడా చదవండి: Thangalaan: ఇదే కదా కావాల్సింది.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తంగలాన్ గ్లింప్స్
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ఇదిలా ఉంటే భారీ వర్షాలు దుబాయ్‌ను అతలాకుతలం చేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై వర్షపునీరు నిలిచిపోవడంతో 28 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే 15 విమానాలు.. అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇది కూడా చదవండి: Moto G64 5G: భారత్ మార్కెట్ లోకి మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా మంగళవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయి. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే బుధవారం కూడా వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. గంటలోపే 254 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పొరుగున ఉన్న ఒమెన్‌లో కూడా భారీ వరదలు కారణంగా పాఠశాల విద్యార్థుల సహా 19 మంది చనిపోయారు. ఇక రోడ్లపై నిలిచిపోయిన వాటర్‌ను తొలగించేందుకు మోటర్లు ఉపయోగిస్తున్నారు. ఇక విమానాలు, రైళ్లు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వేగంగానే పరిస్థితుల్ని చక్కదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.
Unbelievable scenes from Dubai due to heavy rains.. and the city crumbled like this..https://t.co/o7Qg6255op
— Keh Ke Peheno (@coolfunnytshirt) April 17, 2024
The torrents in Oman are worse than in Dubai. No jokes..pic.twitter.com/O6DGA8sFMe
— Henry Kabogo 💧 ❄ 🇰🇪 (@Kabogo_Henry) April 17, 2024
Watch a timelapse capturing the enormous storm that led to a historic flood in Dubai.
pic.twitter.com/Gd7R8RyWVC— 𝔸𝕝 𝕍𝕒𝕣𝕠 𝕏 (@al__varo77) April 17, 2024
Few clips from the heavy rainfall in the once barren desert lands of Dubai 👇https://t.co/6aDsTNtELg
— Kamran Chida (@ChidaKamran) April 17, 2024
- Tags
- dubai
- flooding
- Heavy Rain
- india
- Oman
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!