NTV Telugu Site icon

Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

Heavy Rain Alert

Heavy Rain Alert

Hyderabad Rain: హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. నగరంలోని పలు ప్రాంతాలలో మరోసారి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌, అబిడ్స్, కోఠి, ఉప్పల్‌తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షం వల్ల పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్ల వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేవారు. కాలనీల్లో వరద ఇబ్బందులు లేదా విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Read Also: AP and Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. రూ.3,300 కోట్లు విడుదల

Show comments