NTV Telugu Site icon

Hyderabad Rains : హైదరబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

Rain

Rain

తీవ్రమైన పొడి, వేడి వాతావరణం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని తెచ్చి, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తూర్పు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, సరూర్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. నాగారం, కీసర, ECIL, మౌలా అలీ మరియు దమ్మాయిగూడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే పలుచోట్ల పిడుగులు పడ్డాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మేడ్చల్​ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి.

ఉప్పల్​, హయత్‌నగర్‌ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి. మల్కాజ్‌గిరి, తుర్కయాంజ్‌లో ఈదురుగాలులు వీయగా.. వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులుపడ్డాయి. అలాగే, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోనూ ఈదురుగాలులతో వర్షం వాన కురిసింది. నాగోల్‌, మన్సూరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఎల్‌బీనగర్‌, వనస్థలీపురంలో గాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. శామీర్​ పేటలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలి తాకిడికి రోడ్డుపై వెళ్తున్న బైకర్​ పై ఓ చెట్టు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.