నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణ హైకోర్టు వడగళ్ల వాన కురుస్తోంది. లక్డీకపూల్, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్ బజార్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది. తెలంగాణతో పాటు నగర శివారులోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రభావం చూపిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షానికి రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది.
Also Read : Minister Sidiri Appalaraju : పవన్ మాటల వెనుక అంతర్యం ఏమిటి..?
అయితే.. గత కొన్ని రోజుల నగరవాసులంతా భానుడి ప్రతాపానికి చెమలు కక్కుతుంటే.. ఈ వర్షం కాస్తా ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. అయితే.. రైతుల పాలిట మాత్రం ఈ అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని చూపుతున్నాయి. అయితే.. రాగల మూడు రోజులు హైదరాబాద్ తో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్ లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రాగల మూడు గంటల్లో కొమురంభీమ్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Also Read : Shyam Rangeela: మోడీ గెటప్‌లో హాస్యనటుడు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు