NTV Telugu Site icon

Rain Alert: మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Rain

Rain

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. దీంతో పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు.

Read Also: Odisha : సామాన్యుడి నుంచి అధికారుల వరకు… ఐదు రోజుల్లో లక్షమందిని కలిసిన ఒడిశా కొత్త సీఎం

అలాగే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో వర్షం పడింది. ఈ క్రమంలోనే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో కూడా నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలంగా కదులుతుండటంతో పాటు ద్రోణి ప్రభావం కూడా ఉండటం దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర మొదలు కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.