Heavy Rain Forecast: భారీ వర్ష సూచన.. ఏపీలో 9 జిల్లాలకు, తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Forecast: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తే.. ఏపీలోని 9 జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ.. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు , పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రోజు నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..
మరోవైపు ఈ రోజు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కానీ, ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణశాఖ.. 28న హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక, 28వ తేదీన హైదరాబాద్ సిటీలో వినాయక నిమజ్జనాలు ఉన్న నరేపథ్యంలో.. భారీ వర్ష సూచన ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది ఐఎండీ.
Also Read
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందంటూ ఎల్లో వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.. తమిళనాడు, ఉత్తరాంధ్రను అనుకుని ఉపరితల అవర్తనాలు కొనసాగుతుండగా.. ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడే అవకాశం వుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. మొత్తంగా.. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌కి కూడా భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణశాఖ.
తాజావార్తలు
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!