రాష్ట్రంలో గత వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వడగళ్ల వాన వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాల సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందా అని రైతులు ఎదురు చూస్తుండగా.. వాతావరణ శాఖ మరో ఆందోళన కలిగించే విషయం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ఈ సూచనతో రైతుల్లో ఆందోళన పెరిగింది. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచన ప్రకారం, నేడు, రేపు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయి. అయితే.. సోమవారం సాయంత్రం హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. హైదరాబాద్ లోనే కాకుండా.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Also Read : Marvel: మూడు రోజుల్లో రిలీజ్ ఉంది కానీ బజ్ లేదు… MCU పనైపోయిందా?
దీంతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో వారం పాటు భారీ వర్షాలు ఉంటాయని, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. మధ్య భారత్ లోని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది. అలాగే, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వడగండ్ల వానలు పడతాయని ప్రకటించింది.
Also Read : Sita Ramam: ఈ ప్రేమకావ్యం చరిత్రలో నిలిచిపోతుంది…