గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపల్లి నుండి గచ్చి బౌలి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షపు నీరును అంచనా వేయకుండా కారు డ్రైవర్ ఈ దారి గుండా వర్షపు నీరులోకి వెళ్లడంతో బ్రిడ్జి కింద వర్షపు నీరులో కారు చిక్కుకు పోయింది. కార్ డ్రైవర్ కేకలు విన్న స్థానికులు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటిలో నుండి కార్ డ్రైవర్ ప్రాణాలు కాపాడారు.. అయితే.. నగరంలో కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గంలోని నిజం కాలేజీ,ఉస్మాన్ గంజ్, మహరాజ్ గంజ్ , తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరుకుపోయాయి. పటేల్ నగర్ లోని సాయి కృష్ణ అపార్ట్ మెంట్ లోనికి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read : Afghan Women Protest: కాబూల్‌లో ఆఫ్ఘన్ మహిళల ఆందోళన.. బ్యూటీ పార్లర్‌ల మూసివేతకు నిరసనగా
అంతేకాకుండా… జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్డుపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దమ్మ టెంపుల్ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్న DRF సిబ్బంది.. రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీరును క్లియర్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తోంది DRF బృందం. వర్ష ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. హైదరాబాదులో వరద నీరు తో భారీగా జామ్ అయిన 50 ప్రాంతాలు క్లియర్ చేశామని అధికారులు తెలిపారు.
Also Read : IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
మరోవైపు హైదరాబాద్‌లో మరో 4గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరింది. దీంతో.. భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ టీంలు సిద్ధంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
