Site icon NTV Telugu

Telangana Reservoirs: నిండుకుండల్లా ప్రాజెక్ట్స్.. భారీగా చేరుతున్న వరద నీరు

Telangana Reservoirs

Telangana Reservoirs

Telangana Projects: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 158 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 94,383 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 96,003 క్యూసెక్కులను బయటకు పంపుతున్నారు. 29.917 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 18.237 టీఎంసీల నీరు ఉంది.

PM Modi: పాక్ పై భారత్ సంచలన విజయం.. పీఎం మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 39 గేట్లను ఎత్తివేసి 4,10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 3,40,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 1091 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి, ప్రస్తుతం 1083.30 అడుగుల వద్ద ఉంది. 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి, ప్రస్తుతం 54.623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,50,244 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 21 గేట్లను ఎత్తివేసి 1,51,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1401.22 అడుగుల వద్ద ఉంది. అలాగే, 17.802 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 12.736 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,86,379 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని బయటకు పంపుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 585.50 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 44.3 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Exit mobile version