Telangana Reservoirs: నిండుకుండల్లా ప్రాజెక్ట్స్.. భారీగా చేరుతున్న వరద నీరు
- తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
- నిండుకుండల్లా సింగూరు, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్
- వరద నీటితో పొంగిపొర్లుతున్న జలాశయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Projects: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 158 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 94,383 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 96,003 క్యూసెక్కులను బయటకు పంపుతున్నారు. 29.917 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 18.237 టీఎంసీల నీరు ఉంది.
PM Modi: పాక్ పై భారత్ సంచలన విజయం.. పీఎం మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 39 గేట్లను ఎత్తివేసి 4,10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 3,40,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 1091 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి, ప్రస్తుతం 1083.30 అడుగుల వద్ద ఉంది. 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి, ప్రస్తుతం 54.623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,50,244 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 21 గేట్లను ఎత్తివేసి 1,51,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1401.22 అడుగుల వద్ద ఉంది. అలాగే, 17.802 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 12.736 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,86,379 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని బయటకు పంపుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 585.50 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 44.3 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!