NTV Telugu Site icon

Gandipet Gates: గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. 6 గేట్లు ఎత్తివేత

Gandipet

Gandipet

Gandipet Gates: ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఈ జలాశయం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. జలాశయ గరిష్ట నీటి మట్టం 1790 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1780.15కు నీటిమట్టం పెరగడంతో ఆరు గేట్లను అధికారులు ఎత్తారు.

Read Also: Hyderabad Crime: ఆర్‌ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య

Show comments