Cock Fighting: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో కోడి పందాల హడావిడే మామూలుగా ఉండదు.. కోడి పందాలు నిర్వహించొద్దు.. కఠిన చర్యలు తప్పవు అని అధికారులు, పోలీసులు హెచ్చరించినా.. బహిరంగంగా కొన్ని ప్రాంతాల్లో.. గుట్టుగా మరికొన్ని చోట్ల నిర్వహిస్తూనే ఉన్నారు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ రోజుల్లో 200 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు పందాల్లో చేతులు మారతాయనే అంచనాలు లేకపోలేదు.. అయితే, అదంతా పందాల రూపంలో.. ఇప్పుడు పందెం బరిలో దిగే కోడి పుంజలకు భారీ డిమాండ్ ఉంది.. సంక్రాంతి కోడి పందేలకు ఉండే క్రేజే వేరే లెవల్ కాగా.. పందెంలో మన కోడి నిలవాలి.. గెలవాలి అనుకునేవారు.. ఏరికోరి కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు.. దీంతో, సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
Read Also: Captain Miller: సోషల్ మీడియాలో మిల్లర్ టాక్ మాములుగా లేదుగా…
కోడిపందాలు నిర్వహించడం చట్టవ్యతిరేకమైనప్పటికీ.. సాంప్రదాయం ముసుగులో భారీ వ్యాపారమే సాగుతోంది.. పోలీస్ ఉన్నతాధికారులు సైతం.. రాజకీయ ఒత్తిళ్లుతో కోడిపందాల జోలికి వెళ్లకుంటా ఉంటారనే విమర్శలు లేకపోలేదు.. రాజకీయ నేతలు, బడా బాబులే కాదు.. దేశ విదేశాల నుండి వ్యాపార, సినీ ప్రముఖులు సైతం ఈ కోడిపందాలకు రావడం విశేషంగా చెప్పుకొవాలి.. ఇలాంటి పందాల్లో కోళ్లు పాల్గొనాలంటే.. వాటికి ప్రత్యేక శిక్షణ ఉండాలి.. ఎంతో శ్రమటోర్చి కోళ్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది.. పందాలకు ఉపయోగించే పుంజులను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శిక్షకులను ఏర్పాటుచేసిమరీ పెంచుతున్నారు. ఇందుకోసం పెదవేగి, చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, నల్లజర్ల, అత్తిలి, ఆచంట, పెరవలి, భీమవరం, ఉండి, గణపవరం, పాలకొల్లు, నర్సాపురం ఇలా చాలా ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచడంతో పాటు.. వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట.. మరి ఈ ఏడాది కోడి పందాలు ఏ స్థాయిలో జరుగుతాయే వేచి చూడాలి.
