NTV Telugu Site icon

Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్

Heat Waves1

Heat Waves1

వేసవి కాలం తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 27, మంగళవారం 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, మన్యంలో 6, కాకినాడలో 6, అనకాపల్లి 5, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేద్కర్‌ సూచించారు. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతవరణ శాఖ తెలిపింది.

ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(27) :-

అల్లూరి సీతారామరాజు జిల్లా (07) మండలాలు

1.అడ్డతీగల (41.7డిగ్రీలు)
2.నెల్లిపాక (43.1డిగ్రీలు)
3.చింతూరు (44.7డిగ్రీలు)
4.గంగవరం (42.4డిగ్రీలు)
5.కూనవరం (44.8డిగ్రీలు)
6.రాజవొమ్మంగి (41.2డిగ్రీలు)
7.వరరామచంద్రపురం (43.5డిగ్రీలు)

అనకాపల్లి జిల్లా (05) మండలాలు
8.గొలుగొండ (40.1డిగ్రీలు)
9.కోటవురట్ల (39డిగ్రీలు)
10. మాకవరపాలెం (39.4డిగ్రీలు)
11.నర్సీపట్నం (39.6డిగ్రీలు)
12.నాతవరం (40డిగ్రీలు)

తూర్పు గోదావరి జిల్లా (02) మండలాలు
13.గోకవరం (43.3డిగ్రీలు)
14.కోరుకొండ (42.2డిగ్రీలు)

ఏలూరు జిల్లా(01) మండలం
15.కుకునూర్ (43డిగ్రీలు) మండలం

కాకినాడ జిల్లా (06) మండలాలు

16. గండేపల్లి (41.6డిగ్రీలు)
17.జగ్గంపేట (42.6డిగ్రీలు)
18.కిర్లంపూడి (41.7డిగ్రీలు)
19.కోటనందూరు (39.3డిగ్రీలు)
20.ప్రత్తిపాడు (41డిగ్రీలు)
21. ఏలేశ్వరం (42.5డిగ్రీలు)

పార్వతీపురం మన్యం జిల్లా (06) మండలాలు
22.భామిని (41.8డిగ్రీలు)
23.గరుగుబిల్లి (43.1డిగ్రీలు)
24.జియమ్మవలస (42.8డిగ్రీలు)
25.కొమరాడ (41.4డిగ్రీలు)
26.కురుపాం (42.1డిగ్రీలు)
27.వీరఘట్టం (43డిగ్రీలు)

ఆయా మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని డా.బిఆర్ అంబేద్కర్ , డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Show comments