NTV Telugu Site icon

Heat Waves Effect: ఏపీలో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు… హై అలర్ట్

Heat Waves

Heat Waves

ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44డిగ్రీలు నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల నుంచి – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Read Also; Fraud: బోగస్‌ కంపెనీలను పెట్టి.. బ్యాంకుల నుంచి కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్ అరెస్ట్

కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీల నుంచి – 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న 40 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 148 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో నిన్న అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీల వరకూ … ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.

పలు జిల్లాల్లో మొత్తంగా 13మండలాల్లో 46డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42డిగ్రీలు -44డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు అందాయి. మెసేజ్ అందినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డా.బీఆర్ అంబేద్కర్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.

Read Also: Hypertension Day: హైబీపి రావడానికి ఇది కూడా కారణమే..!