దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 23 వరకు ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Iran Israel tensions: ఎలాన్ మస్క్ కీలక మెసేజ్.. ఇరు దేశాలకు ఏం సూచించారంటే..!
ఏప్రిల్ 20-21 మధ్య ఒడిశా, 20-23 మధ్య జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్‌లకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 20న ఒడిశా, 20-22 మధ్య గంగా పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాం, కేరళ, మాహే, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఏప్రిల్ 20-23 మధ్య వేడిగాలులతో పాటు తేమతో కూడిన వాతావరణాన్ని ఉండొచ్చని సూచించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!
ఇదిలా ఉంటే శుక్రవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పలుచోట్లు భారీ వర్షాలు కురిశాయి. పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని రాజ్‌పురా నగరంలో భారీ వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. అలాగే జలంధర్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వడగళ్ల వానలు కురిశాయి. ఇక కర్నాల్, హర్యానాలో భారీ వర్షం, వడగళ్లు పడ్డాయి. దీంతో పండిన పంటలు దెబ్బతిన్నాయి. అలాగే పూంచ్, జమ్మూకాశ్మీర్‌లో బలమైన గాలులు, వర్షాల కారణంగా కలాని-చక్తో గ్రామాలను కలిపే ఫుట్ బ్రిడ్జి దెబ్బతింది.