Iran Israel tensions: ఎలాన్ మస్క్ కీలక మెసేజ్.. ఇరు దేశాలకు ఏం సూచించారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవలే ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో తెగబడింది. దీనికి ప్రతీకారంగా శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులకు తెగబడింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈ దాడులను తిప్పికొట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి: UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!
Also Read
ఈ ఉద్రిక్తల మధ్య తాజాగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం పంపారు. ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌లో ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు, క్షిపణులు వేసుకోవడం కాదు.. బదులుగా అంతరిక్షంలోకి వాటిని పంపాలని సూచించారు. తన పోస్ట్‌కు ఒక రాకెట్ ఫొటోను కూడా జత చేశారు.
2023 నవంబర్‌లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. ఎలాన్ మస్క్‌కు చూపించారు. ఆ పర్యటన తర్వాత మస్క్‌ని గాజా సందర్శన కోసం హమాస్ కూడా ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఎలా ధ్వంసమైందో చూడాలని కోరింది. స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్ వర్క్ స్టార్ లింక్ ఇజ్రాయెల్‌తో పాటు, గాజా స్ట్రిప్ లో సేవలు అందించేందుకు 2024 ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులను తక్షణం ఆపాలని సందేశం ఇచ్చేలా ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్‌లో భారీ పెలుళ్లు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ దాడి విషయాన్ని అమెరికాకు చెందిన సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. తమ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. తాము భారీ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ మిగలదని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై క్షిపణి దాడుల చేసింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా ఈ క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇస్ఫహాన్ ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇస్ఫహాన్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు సిరియాపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు.
We should send rockets not at each other, but rather to the stars pic.twitter.com/h4apedUrsU
— Elon Musk (@elonmusk) April 19, 2024
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?