Site icon NTV Telugu

Chandrababu: చంద్రబాబుకు గుండె సమస్య !

Chandrababu

Chandrababu

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గుండె సమస్య ఉన్నట్లు తేలింది. చంద్ర బాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు ఆయన లాయర్లు సమర్పించారు. ‘చంద్రబాబు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచి జాగ్రత్తలు పాటించాలి’ అని వైద్యులు చెప్పారని చంద్రబాబు లాయర్లు కోర్టుకు వివరించారు. కాగా 15 రోజుల కిందట చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత కంటి ఆపరేషన్ చేయించుకున్న చంద్రబాబు… ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు.

Also Read: Ap Deputy Cm Amjad Basha: సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం

మరో వైపు.. స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకి తిరిగి విచారణ చేపట్టనున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. మరో వైపు చంద్రబాబు కంటి ఆపరేషన్‌, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.

Exit mobile version