Site icon NTV Telugu

Chandrababu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu

Chandrababu

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతరబెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు రెండూ వచ్చే మంగళవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

Also Read: Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌కు భువనేశ్వరికి అనుమతి తిరస్కరణ

చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సీఐడీ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించింది. ప్రాథమిక సాక్ష్యాలతో అరెస్ట్ చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని సీఐడీ పేర్కొంది. విచారణ చేయాల్సి వస్తే దానికి అర్హత ఉందా లేదా అనేది ముందు విచారణ జరపాలని కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొచ్చని కోర్టు ముందు వాదనలు చంద్రబాబు న్యాయవాది వినిపించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ చేయాల్సి వస్తె కౌంటర్‌కు సమయం ఇవ్వాలని, సాయంత్రం 4 గంటలకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ విచారణకు వస్తారని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

Exit mobile version