Site icon NTV Telugu

MLAs Defection Case: నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ!

Supreme Court

Supreme Court

నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరపు వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, పిరాయించిన ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏడాది దాటినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది.

Also Read: BC Poru Garjana: న్యూఢిల్లీలో బీసీల పోరు గర్జన.. హాజరు కానున్న రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి!

బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా ఓడిపోయి.. ఇపుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. స్పీకర్ అనర్హత చట్టాన్ని అమలు చెయ్యాలని కోర్టులు ఎందుకు కోరవద్దని బీఆర్ఎస్‌ వాదిస్తోంది. ఇప్పటికే పిరాయింపుల కేసులో స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేసింది. పిరాయింపుల అంశంలో చట్టాన్ని స్పీకర్ ఫాలో అవుతున్నారని పేర్కొంది. కోర్టులు స్పీకర్‌ను ఆదేశించవద్దని, అనర్హత చట్టంలోని ప్రొసీజర్‌ను ఫాలో అవుతున్నామని తెలిపింది.

Exit mobile version