YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి గురువారం కీలకం కానుంది. బెయిల్ పిటిషన్ విచారణను.. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తేల్చాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను.. సుప్రీంకోర్టు అంగీకరించడంతో, గురువారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ అంశం మరోసారి తెలంగాణ హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: R5 Zone Layouts: ఆర్ ఫైవ్ జోన్‌లో లేఅవుట్లు రెడీ..
అయితే, ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో దూకుడుగా ఉన్న సీబీఐ..హైకోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. అటు సీబీఐ ఇటు అవినాష్ రెడ్డి, మరోవైపు వైఎస్ సునీత వాదనలు ఎలా ఉంటాయి?.. విచారణ తర్వాత హైకోర్టు వెకేషన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సోదరి విమలారెడ్డి. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని.. తప్పుచేయని వారిని జైల్లో పెట్టారని ఆరోపించారు. అవినాష్‌ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని మొదట చెప్పిన సునీత.. ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. కర్నూలు ఆసుపత్రిలో అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించిన విమలారెడ్డి.. అవినాష్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ఇక, వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు సునీతారెడ్డి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్.. శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది.
