Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Healthy Sattu Drink Recipe Benefits For Diabetes Bp Weight Loss

Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!

Published Date :April 4, 2026 , 11:35 am
By Shiva Ganesh
Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Healthy Summer Drinks : ఎండ కాలం వచ్చిందంటే చాలు.. ఫ్రిజ్ లోని చల్లని నీళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ వైపు మన మనసు లాగుతుంది. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లుగా సహజసిద్ధమైన డ్రింక్స్ తీసుకోవడం ఉత్తమం. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ మన శరీరంలో శక్తి తగ్గిపోయి, నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ, వేడిని తగ్గించే అద్భుతమైన డ్రింగ్ ‘సత్తు డ్రింక్’. ఈ ‘సత్తు డ్రింక్’ అనేది ఒక నాచురల్ సమ్మర్ కూలర్ లాంటిది. దీనిని తాగడం వల్ల శరీర వేడి తగ్గడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా శరీరానికి అందుతాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, దీనిని సింపుల్‌గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!

తయారీకి కావాల్సిన పదార్థాలు ఇవే..
ఈ డ్రింక్ చేయడానికి ముందుగా మనం ‘సత్తు ప్రీమిక్స్’ పౌడర్‌ని సిద్ధం చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే..

ఉప్పు శెనగలు (Roasted Gram): 1 కప్పు (పొట్టు తీసినవి)

ఎండుమిరపకాయలు: 2

జీలకర్ర: 1 టీస్పూన్

మిరియాలు: ½ టీస్పూన్

పుదీనా ఆకులు: 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించినవి)

ఉప్పు & నల్ల ఉప్పు (Black Salt): రుచికి తగినంత

తయారీ విధానం ఇదే..
ముందుగా పొట్టు తీసిన ఉప్పు శెనగలను లో ఫ్లేమ్ మీద కొద్దిగా వెచ్చబడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, పుదీనా ఆకులు వేసి క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేయాలి. వేయించిన వీటన్నింటినీ పూర్తిగా చల్లార్చి, మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఎయిర్ టైట్ జార్‌లో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు.

సత్తు డ్రింక్ ఇలా చేసేయండి..
ఒక గిన్నెలో లేదా మట్టి కుండలో పావు కప్పు సత్తు పొడిని తీసుకోండి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేయండి. అనంతరం అర లీటర్ నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. లాస్ట్‌లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ఇంతే సింపుల్‌గా మీ ఇంట్లో హెల్తీ సమ్మర్ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు.

సత్తు డ్రింక్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఎండలో తిరిగినప్పుడు ఇది తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. అలాగే ఇది నాచురల్ కూలర్ కావడంతో శరీరంలోని వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది తాగిన తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. ఈ వేసవిలో రసాయనాలతో కూడిన డ్రింక్స్ బదులుగా, ఇలా ఇంట్లోనే ‘సత్తు డ్రింక్’ తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

READ ALSO: US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Benefits of Sattu Powder
  • Best Drink for High BP in Summer
  • Healthy Summer Drinks Telugu
  • Homemade Sattu Premix
  • Natural Energy Drink for Diabetes

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions