Ragi Burelu Recipe: రుచి, ఆరోగ్యం ఇచ్చే ‘రాగి బూరెలు’.. సూపర్ సాఫ్టిగా ఇంట్లోనే చేసేయండి ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Burelu Recipe: చాలామందికి స్వీట్స్ తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే ప్రస్తుత రోజుల్లో స్వీట్స్ కాస్త ఎక్కువగా తిన్న షుగర్ వ్యాధి పరిపాటిగా మారింది. అయితే వీటికి ప్రత్యయంగా అనేక రుచికరమైన, ఆరోగ్యమైన స్వీట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబులకు చిల్లులు పడుతున్నాయి. మరీ దీనికి పరిష్కారంగా ఆరోగ్యకరమైన స్వీట్ తినాలనిపించినప్పుడు ‘రాగి బూరెలు’ మంచి ఎంపికగా చేసుకోవచ్చు.
రాగి పిండితో చేసే ఈ బూరెలు మృదువుగా, పొంగుతూ స్పాంజిలా వస్తాయి. వీటిని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎవరినా సులభంగా పర్ఫెక్ట్గా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ రుచికరమైన రాగి బూరెలను ఎలా తయారు చేయాలో వివరంగా చూసేద్దామా.
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
కొత్త A20 చిప్, శాటిలైట్ నెట్వర్క్ సపోర్ట్.. iPhone 18 Pro Seriesలో భారీ అప్గ్రేడ్లు!
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* గోధుమ పిండి – 1 కప్పు (లేదా రాగి పిండికి సగం పరిమాణం)
* బెల్లం తురుము – 1 కప్పు
* నీరు – ¼ కప్పు
* ఎండు కొబ్బరి – 2 ఇంచుల ముక్క
* యాలకులు – 3 లేదా 4
* నువ్వులు – 2 టీ స్పూన్లు
* నెయ్యి – 1 టేబుల్ స్పూన్
* వంట సోడా – ¼ టీ స్పూన్
* ఉప్పు – చిటికెడు
* పాలు (లేదా నీరు) – అవసరానికి సరిపడా
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
తయారీ విధానం:
కొబ్బరి మిశ్రమం సిద్ధం చేయడం:
ముందుగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి యాలకులతో కలిసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా కాకుండా పొడి లాగా ఉండాలి.
పిండిని కలపడం:
ఒక గిన్నెలో రాగి పిండిని జల్లించి తీసుకోవాలి. అలాగే గోధుమ పిండిని కూడా జల్లించి కలపాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. గోధుమ పిండి కలపడం వల్ల బూరెలు గట్టిగా కాకుండా మృదువుగా వస్తాయి.
Insulin Resistance: షుగర్ టెస్ట్ నార్మల్.. అయినా అలసట! “హిడెన్ డయాబెటిస్” కావచ్చు.. జాగ్రత్త సుమీ!
బెల్లం పాకం:
స్టవ్‌పై గిన్నెలో బెల్లం తురుము వేసి అందులో పావు కప్పు నీరు పోసి కరిగించాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. తరువాత నువ్వులు, గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి వేసి ఒక నిమిషం ఉడికించాలి. చివరగా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
పిండిలో బెల్లం మిశ్రమం కలపడం:
వేడి వేడి బెల్లం నీటిని పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి. మొత్తం ఒకేసారి పోయకూడదు. ఈ దశలో పావు టీ స్పూన్ వంట సోడా వేయాలి. అవసరమైతే వేడి చేసి చల్లార్చిన పాలు లేదా నీరు కొద్దికొద్దిగా వేసి జిగురుగా, సాఫ్ట్‌గా కలపాలి. పిండి కొంచెం మెత్తగా ఉండాలి. మూతపెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచాలి.
బూరెలు తయారు:
ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడి అయ్యిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేయాలి. చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని పిండి చిన్న ముద్ద తీసుకుని ప్లాస్టిక్ కవర్ లేదా అరటాకుపై మధ్యస్థ మందంతో ఒత్తాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఉండాలి. వీటిని వేడి నూనెలో వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. బూరెలు చక్కగా పొంగి మృదువుగా తయారవుతాయి.
Ishan Kishan: పాకిస్థాన్‌పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఇక టీ20 ప్రపంచకప్‌లో రెచ్చిపోతాం!
రుచిగా, ఆరోగ్యంగా:
ఈ రాగి బూరెలు మైల్డ్ స్వీట్ టేస్ట్‌తో ఎంతో రుచిగా ఉంటాయి. రాగి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సాయంత్రం స్నాక్‌గా లేదా పండుగ సందర్భాల్లో చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే తప్పకుండా మళ్లీ మళ్లీ చేయాలనిపించే రుచికరమైన హెల్తీ స్వీట్ ఇది. ఇంకేం చూస్తున్నారు చేయడం మొదలు పెట్టేసేయండి.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?