NTV Telugu Site icon

Musheer Khan: ముషీర్‌ ఖాన్‌ హెల్త్ అప్‌డేట్.. వైద్యులు ఏమన్నారంటే?

Musheer Khan Accident

Musheer Khan Accident

Musheer Khan Health Update: ముంబై యువ ఆల్‌రౌండర్‌, టీమిండియా క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శనివారం పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ముషీర్‌ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముషీర్‌ మెడకు గాయాలయ్యాయి. దాంతో ముషీర్‌ను హుటాహుటిన లక్నోలోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

ముషీర్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతోందని మేదాంత హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ భోలా సింగ్ చెప్పారు. ‘రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ ముషీర్ ఖాన్ మెడకు గాయం అయింది. అత్యవసర చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ముషీర్‌ పరిస్థితి నిలకడగానే ఉంది. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలిస్తాం. అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని భోలా సింగ్ తెలియపరు. బీసీసీఐ సహా ముంబై క్రికెట్ అసోసియేషన్ అతడి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Also Read: IPL 2025 Auction: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై విదేశీ ఆటగాళ్లకు భారీ ధర లేనట్టే!

అక్టోబర్‌ 1న మొదలయ్యే ఇరానీ కప్‌ కోసం అజామ్‌గఢ్‌ నుంచి లక్నోకు తన తండ్రి నౌషద్‌ ఖాన్‌తో ముషీర్‌ ఖాన్‌ కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కనీసం మూడు నెలలు ఆటకు దూరం కానున్నాడు. దులీప్‌ ట్రోఫీలో సెంచరీ చేసిన ముషీర్‌కు భారత ఏ జట్టులో చోటు దక్కడం ఖాయమని అందరూ భావించారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. గత ఏడాది నుంచి మంచి ఫామ్‌లో ఉన్న ముషీర్‌ 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.

Show comments