గుమ్మడి కాయలతో చేసే వంటలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కూరలు, స్వీట్స్ చేస్తారు.. కేవలం గుమ్మడి కాయలు మాత్రమే గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రూట్ షాప్ లలో,ఆన్లైన్ స్టోర్ లలోనూ, సూపర్ మార్కెట్స్ లో విరివిగా లభ్యం అవుతున్నాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. వీటిలో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్ తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.
అంతేకాదు రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది.. గుండె పని తీరును మెరుగు పరుస్తుంది.. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన డయబెటిస్ నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైటోస్టెరాల్స్, విటమిన్ ఈ ఉత్పన్నాలు, కెరోటిన్ సమృద్దిగా ఉండటం వలన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టటానికి సహాయపడుతుంది. ఈ గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే అధిక బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.. వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరిగేలా చేస్తుంది. అలాగే చర్మం ముడతలు లేకుండా యవ్వన్నంగా ఉండేలా చేస్తుంది. ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.