NTV Telugu Site icon

Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?

Sweetss

Sweetss

స్వీట్స్.. ఈ పేరు వినగానే చాలా మందికి కళ్ల ముందే కనిపిస్తాయి.. వీటిని ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్ లో పంచదార లేకుండా అసలు ఉండవు.. అయితే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రం అస్సలు వీటి జోలికి వెళ్ళకూడదు అని అంటున్నారు. మధుమేహం మాత్రమే కాదు అనేక విధమైన రోగాలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పుడు దానికన్నా ప్రమాదమైన వ్యాధులు వస్తాయని తాజా సర్వేలో వెల్లడైంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మాములుగా టీ, కాఫీ, స్వీట్లు ఇలా మనం నిత్యజీవితంలో చక్కెరను వాడుతూ ఉంటాం. చాలామంది షుగర్‌ ఎక్కువ వేసుకుని మరీ టీ, కాఫీలు తాగుతుంటారు. ఇక కొందరు ఏకంగా స్వీట్లు ఎక్కువగా తింటుంటారు. కేకులు, చాక్లెట్లు, ఐస్‌క్రీంలరూపంలో ఒంట్లోకి అదనపు చక్కెర చేరిపోతుంది. చక్కెర తో చేసిన వాటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక బరువును పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. చక్కెరను మితి మీరి తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని బెల్జియం నిపుణులు తాజా పరిశోధనలో వెల్లడించారు..

చక్కెరను ఎక్కువగా వాటితే శరీరంలో క్యాన్సర్ గడ్డలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అతిగా చక్కెర వాడినవారిపై తొమ్మిదేళ్ల సుదీర్ఘ అధ్యయనం చేశారు. అధ్యయనాల ప్రకారం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వారు వెల్లడించారు. తినుబండారాలు, మిఠాయిలు, ఇతరత్రా ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరిన తర్వాత చక్కెర పులిసిపోతుంది. చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్‌ కణాలు శక్తిని పొందుతాయని పరిశోధనల్లో గుర్తించారు. అయితే క్యాన్సరేతర కణాలపై పులిసిపోయిన చక్కెర ప్రభావం ఉండదని వారు ధృవీకరించారు.. అందండి సంగతి.. తియ్యగా ఉండే చక్కెర వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయి.. ఇప్పటినుంచి కాస్త దూరంగా ఉండండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి…

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments