Site icon NTV Telugu

Health Tips: మహిళలకు అరికాళ్లల్లో ఎందుకు నొప్పి వస్తుందో తెలుసా?

Womens

Womens

మగవారి కన్నా కూడా మహిళలకు ఎక్కువగా పనులు ఉంటాయి.. ఇంటి బాధ్యత పిల్లలు ఇలా పనులు మొత్తం వారి మీదే ఉంటుంది.. దాంతో వారికి నొప్పులు రావడం కూడా సహజమే.. ఆడవారిలో అరికాళ్లలో నిప్పి వస్తుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎక్కువసేపు నిలబడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. చాలా సార్లు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం వలన అరికాళ్ళలో భరించలేని నొప్పి అనిపిస్తుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. స్త్రీల అరికాళ్ళలో నొప్పికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మాములుగా ఇది పాదాలకు సంబంధించిన సమస్య. దీనిని ఆర్థోపెడిక్ అని కూడా అంటారు. దీని కారణంగా, అరికాళ్ళ కణజాలంలో వాపు ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ సేపు నడవడం వల్ల అరికాళ్లలో నొప్పి ఎక్కువ అవుతుంది. అరికాళ్లకు గాయం కావడం, అరికాళ్లలో వాపు, పాదాలు విరగడం వంటి కారణాల వల్ల కూడా నొప్పి వస్తుంటుంది.. ఈ అరికాళ్లలో నొప్పిని ఎలా తగ్గించాలంటే..

ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కాస్త పసుపు, ఉప్పు వేయాలి. ఆ తరువాత అందులో పాదాలను కాసేపు ముంచండి. దీంతో అరికాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా..ఒక గాజు సీసా తీసుకుని వేడి నీటిలో నింపాలి. ఆ తరువాత ఈ సీసాతో పాదాల అరికాళ్ళను పూర్తిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గడమే కాకుండా టెన్షన్‌ తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐస్ మాదిరిగా గడ్డకట్టినప్పుడు.. దానిని ఒక గుడ్డలో చుట్టి, అరికాళ్ళకు మసాజ్ చేయాలి.. ఇది కూడా నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.. ఇలా చేసిన నొప్పి తగ్గకుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version