ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు… అది నిజమే.. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.. నోటికి రుచిగా ఉన్నవాటిని తీసుకుంటు, ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు.. అలాగే సరైన వ్యాయామం కూడా చెయ్యక పోవడంతో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండెపోటుతో పాటు వివిధ రకాల గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలకు ఉల్లిపాయ టీతో చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఆ టీ గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి. తరువాత ఇందులో ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో ఒక యాలక్కాయ, రెండు దంచిన మిరియాలు, అర టీ స్పూన్ సోంపు గింజలు వేసి 5 నుండి 8 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత దీనిని గోరు వెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.
ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?
ఈ పానీయాన్ని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్తనాళాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు ఈ పానీయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఇంక గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.. మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.