NTV Telugu Site icon

Problems with Pillow : దిండు లేకుండా పడుకోలేరా? అయితే ఈ సమస్యలు రావచ్చు!

Pillow Problems

Pillow Problems

Problems with Pillow : రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామందికి తలకింద దిండుపెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అయితే కొంత మంది పెద్ద దిండు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. చిన్న దిండు అయితే ఫర్వాలేదు కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మెడనొప్పి: ఎతైన దిండు పెట్టుకొని పడుకుంటే మొదట్లో తెలియక పోవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికం వేధిస్తుంది. మందులు వాడుతూ కూడా మీరు మీ తలగడ ఉండే విధానాన్ని మార్చుకోకపోతే ప్రయోజనం ఉండదు.

వెన్నునొప్పి: కొంతమందిలో ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పి వస్తుంది. మీరు ఈ సమస్యను గమనించినట్లయితే అర్థం మీరు ఎతైన దిండు తలకింద పెట్టుకొని నిద్రించినట్లు. ఇలా రోజూ చేయడం వల్ల వెన్నెముక వంగిపోతుంది. వెన్నుముక డిస్క్‌లలో దూరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు

తలలో రక్త ప్రసరణ జరగదు: ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీని వల్ల తరచూ తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా సరిగా జరగక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఇది మాత్రమే కాకుండా శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు వస్తాయి.

ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి దిండ్లను ఉపయోగించాలి: రాత్రి పూట నిద్రించేటప్పుడు ఉపయోగించే దిండు వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి. అలాంటి దిండు లేకపోతే మెత్తటి టవల్‌ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. ఎక్కువ ఎత్తు ఉండే దిండును ఉపయోగించే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును మానుకొని చిన్నదిండు ఉపయోగించడం ప్రారంభించడం మంచిది.