భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ లో జిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. GSR సేవలు పార్టీలకు అతీతమని, హెల్త్ క్యాంప్ ను అడ్డుకోవడానికి చాలా కుట్రలు జరిగాయన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు, అదే విధంగా నా సేవలు ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. నియోజక వర్గం సరిగా లేదనే బాధ ఉందని, మీరు ఇచ్చే తీర్పే నియోజక వర్గ పరిస్థితి ని మారుస్తుందన్నారు. కొత్తగూడెంకు కొత్త నాయకత్వం కావాలని, గత 30 ఏళ్ల కింద కొత్తగూడెం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పాండవుల అరణ్యవాసం ముగిశాక మహాభారతం జరిగిందని, ఇప్పుడు మన యుద్ధం ఆరంభం అయ్యింది ఇక చూసు కుందాం అని ఆయన అన్నారు. సేవలకు సీఎం అనుమతి ఇచ్చారని, కేసిఆర్ నాకు ఆదర్శమన్నారు.
Also Read : Parampara : భోజన ప్రియులకు శుభవార్త.. అబిడ్స్‌లో ప్రముఖ రెస్టారెంట్ ‘పరంపర’
సిద్దిపేట అభివృద్ధి లో బెస్ట్ నియోజకవర్గం, అది కొత్తగూడెం లో 50 శాతం జరిగినా చాలని, మనం చేసిన మంచి కార్యక్రమాలే మనతో వస్తాయని ఆయన అన్నారు. కొత్తగూడెంకు నేను ఇవ్వాల్సింది ఇస్తానని, బయటకు వద్దాం మరొక కొత్త వాతావరణాన్ని మన పిల్లలకు ఇద్దామని ఆయన అన్నారు. సుజాతనగర్ కొత్తగూడెం నియోజకవర్గానికి ముఖ ద్వారమని.. ప్రజల ఆశీస్సులు ఉంటేనే కొత్తగూడెం నియోజకవర్గంలో గెలుపు సాధ్యమనన్నారు శ్రీనివాస్ రావు. కొత్తగూడెం మార్పు చెందాల్సిన అవసరం ఉందని.. కొత్తగూడాన్ని మరో కొత్తగూడెంగా తీర్చిదిద్దేందుకు కొత్త నాయకత్వం అవసరమని చెప్పారు. అందరం ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు.
Also Read : MP Mithun Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఆధారాలతోనే సస్పెండ్ చేశాం