NTV Telugu Site icon

Health Crisis In Srilanka: శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం.. హస్పటల్స్కి తాళాలు

Srilanka

Srilanka

Health Crisis In Srilanka: పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది. గత రెండేళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో 10 శాతం (1700 మంది) వైద్యులు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఏర్పాడింది. శ్రీలంక వైద్యులు దేశం విడిచి వెళ్లడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోవిడ్ నుంచి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్న శ్రీలంకలోని ప్రజలు చికిత్స కూడా పొందలేకపోతున్నారు. అయితే, రాజధాని కొలంబోకు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాధపుర టీచింగ్ హాస్పిటల్‌లోని పిల్లల వార్డును వైద్యుల కొరత కారణంగా క్లోజ్ చేశారు. కొలంబోకు ఆనుకుని ఉన్న మరో ఆసుపత్రిలో, అనస్థీషియా విభాగంలో వైద్యుల కొరతతో అన్ని రకాల ఆపరేషన్లు, ఎమర్జెన్సీ కేసులు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా 100కి పైగా ఆసుపత్రులు మూసివేత అంచున ఉన్నాయనే విషయాన్ని అల్ జజీరా యొక్క నివేదికలో శ్రీలంక ఆరోగ్య మంత్రి రమేష్ పతిరానా తెలిపారు.

Read Also: Bihar Political Crisis : బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ(వీడియో)

ఇక, శ్రీలంకను విడిచిపెట్టి విదేశాలకు వెళ్తున్న వైద్యులు తమకు దేశంలో డబ్బు, గౌరవం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా, అధిక ద్రవ్యోల్బణం కారణంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో జీవించవలసి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైద్యులు ఇప్పుడు తమ భవిష్యత్త్, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు.. అందుకే వారు దేశం విడిచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అని వెల్లడైంది. కాగా, కోవిడ్ మహమ్మారి తర్వాత శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తి సంక్షోభంలో చిక్కుకుంది. అ దేశ ప్రజలు ఆహారం, మందులు, ఇంధనం లాంటి అనేక ఇతర నిత్యావసర వస్తువుల కోసం గంటల తరబడి క్యూలలో నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పాడింది. దీనికి వైద్యులు మినహాయింపు కాదు.. కానీ వైద్యులు ప్రత్యేక ఇంధన కోటా కోసం అభ్యర్థించడంతో.. ప్రజా వ్యతిరేకత చెలరేగింది. ప్రస్తుతం శ్రీలంక వైద్యులు అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, ఔషధాల కొరత, ఆహార కొరతను సైతం ఎదుర్కొంటున్నారు.