Health Tips: సాధారణంగా డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందుకోసం రాత్రంతా ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. నానబెట్టిన ఖర్జూరాలలో ఫైబర్, విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారికి ఖర్జూరం తీసుకుంటే చాలా మేలు చేస్తుంది.
Read Also: Puri Jagannadh: రచ్చ గెలిచి ఇంటి మీద పడ్డ పూరి.. ఈసారి ఆ హీరోతో..?
ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంతేకాకుండా కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఖర్జూరాలలో ఉండే విటమిన్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు చర్మంపై ఉండే ముడతలను తొలగిస్తాయి. అలాగే నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల మెదడుకు కూడా ఎంతో మంచిది. ఇందులో ఉండే విటమిన్ బి జ్ఞాపకశక్తిని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరంలో మాంగనీస్, కాపర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి.