Litchi : లిచీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎపికాటెచిన్, రుటిన్ అనే మొక్కల భాగాలు ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. లిచీలో ఉండే ఐరన్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. లిచీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెకు రక్షణ ఇస్తుంది
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల లీచీలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒలిగోనాల్ అనే ఒక భాగం నైట్రిక్ ఆక్సైడ్ (NO) సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. ఇది రక్త నాళాల విస్తరణకు, గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి, మొత్తం గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది.
బీపీ తగ్గిస్తుంది
లిచీలో ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించేందుకు కావాల్సిన పొటాషియం, సోడియం సమతుల్య నిష్పత్తి ఉంటుంది. రక్తపోటును తగ్గించడానికి లిచీ సమర్థంగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
లిచీలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే నీటిలో కరిగే విటమిన్. ఇది హానికర సూక్ష్మజీవుల నుంచి కాపాడుతుంది. లీచీ దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.
Read Also:Maharashtra CM : షిండే సీఎం కుర్చీ ఖాళీ చేస్తే.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
రక్త ప్రసరణను మెరుగుపడుతుంది
రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి లిచీలు ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో ఐరన్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె, ఎముకలకు కూడా మేలు చేస్తాయి.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
ఈ పండులో వాటర్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Read Also:Anxiety Tips : ఆందోళనను తగ్గించడంలో సహాయపడే ఐదు సూపర్‌ఫుడ్స్ ఇవే..
రక్తహీనతను నివారిస్తుంది
ఈ పండులో అవసరమైన మొత్తంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనతను నివారించడంలో లిచీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
లిబిడోను పెంచుతుంది
లిచీ పొటాషియం, రాగి, విటమిన్ సితో సహా ముఖ్యమైన పోషకాలకు ప్రసిద్ది చెందింది. ఈ పండును తింటే లైంగిక కోరికలు పెరుగుతాయి. అలాగే లిబిడో కూడా బాగా పెరుగుతుంది.