Health Tip: ఈ కాలంలో విరివిగా లభించే పండ్లలో సీతాఫలం చాలా ముఖ్యమైనది. మధురమైన రుచిని అందించడంతో పాటు శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు సీతాఫలం సొంతం. ఇందులో విటమిన్ ఏ, బీ6,సీ లతో పాటు మెగ్నీషియం, కాపర్, పోటాషియ, ఫైబర్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. పురుషులలో ఏర్పడే నరాల బలహీనత మరియు కండరాల వృద్ధిని పెంచే గుణాలు సీతాఫలం లో మెండుగా ఉన్నాయి. అందువల్ల నరాల బలహీనత సమస్యతో బాధపడే పురుషులు ఉదయాన్నే ఒక సీతా ఫలాన్ని తీసుకోవటం వలన సమస్యను దూరం చేసుకోవడమే కాకుండా శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు. మీరు సన్నగా బలహీనంగా ఉన్నారా? అయితే దీనికి సీతాఫలం ఒక చక్కటి పరిష్కారం చూపుతుంది.
Also Read :Migraine Pain: మైగ్రేన్ నొప్పి రావడానికి అసలు కారణాలు ఇవే..
సీతా ఫలాన్ని మరియు తేనెను తగిన మోతాదులో తీసుకోవడం వలన ఎటువంటి ఎఫెక్ట్స్ లేని ఆరోగ్యవంతమైన బరువును పొందుతారు. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి సీతాఫలం ఒక చక్కటి రెమెడీ అని చెప్పవచ్చు. ఈ కాలంలో విరివిగా దొరికే సీతాఫలాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవటం వలన అది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపి, ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెట్టు పెడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఆస్తమా, గుండె పోటు నుండి మనల్ని కాపాడుతుంది. సీతాఫలాన్ని తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం అవుతుంది. కడుపులో ఉండే బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బిడ్డ యొక్క మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. తల్లి యొక్క పాల ఉత్పత్తిని పెంచడంలో సీతాఫలం అమోఘంగా సహాయపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి సీతాఫలం నిజంగా ఒక వరంగా చెప్పవచ్చు. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలాన్ని జ్యూస్ గా లేదా నేరుగా తీసుకోవడం వలన ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు అల్సర్, గ్యాస్, ఎసిడిటి వంటి ఉదర సమస్యలను కూడా నివారిస్తుంది.
Also Read : Health Tips : రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. మీ ఆరోగ్యం భద్రం..!
సాధారణంగా వయసు పైబడటం వలన చాలా మంది జాయింట్ పెయిన్స్ మరియు కీళ్ళ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సీతాఫలంలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో జాయింట్స్ వద్ద ఏర్పడే యాసిడ్స్‌ను తగ్గిస్తుంది. అందువల్ల కీళ్ల సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను, బీపీని తగ్గించడంలో సీతాఫలం తనదైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్దీకరణ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా టైప్-2 డయాబెటీస్ నుండి మనల్ని రక్షిస్తుంది. జుట్టు పెరుగుదలలో కూడా సీతాఫలం తనదైన పాత్ర పోషిస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఏ ఉంది. సీతా ఫలాన్ని తీసుకోవడం వల్ల సహజంగా మీ చర్మం కాంతివంతం అవుతుంది. అంతేకాకుండా విటమిన్ ఏ మీ దృష్టి లోపాలను కూడా సవరించి చురుకైన కంటి చూపుని ఇస్తుంది.