Site icon NTV Telugu

Headmaster beaten up: మూడో తరగతి చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హెడ్‌మాస్టర్‌కు దేహశుద్ధి

Headmaster

Headmaster

Headmaster beaten up: టీచర్ అంటే ఏం చేయాలి? పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. కానీ ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడో తెలుసా? చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం ప్రాంతంలో గల జిల్లా ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల ప్రధానోపాధ్యాయుడు షాజహాన్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. హెడ్‌మాస్టర్‌ ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన బాలిక బంధువులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రధానోపాధ్యాయుడిని ఆస్పత్రికి తరలించారు.

Two Tigers: తడోబా అంధారి రిజర్వ్‌లో 24 గంటల్లో 2 పులులు మృతి

మరోవైపు ప్రధానోపాధ్యాయుడు షాజషాన్‌ తనపై వచ్చిన ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించాను అన్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. ఏ కారణంగా వాళ్ళు తనపై ఆరోపణ చేస్తున్నారన్నది విచారణలో తేలుతుందన్నారు. తన గురించి తాను పని చేస్తున్న స్కూల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో అడగండి అంటూ వెల్లడించారు. అప్పుడు నిజాలు తెలుస్తాయన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version